కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటింటికి వెయ్యి రూపాయల నగదును పంపిణీ చేసిన ఎమ్మెల్యే అధీప్ రాజు
పరవాడ పెన్ పవర్
పరవాడ:మండల కేద్రం సంతబయలు లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వం ప్రకటించిన రేషన్ కార్డ్ కలిగిన ఇంటికి వెయ్యి రూపాయలు నగదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం విధించిన స్వీయ నిర్బందాన్ని ప్రజలందరూ శహకరించి వారి ఇళ్లలోనే ఉండి కరోనాని సమూలంగా నివారించేందుకు ప్రభుత్వానికి,పోలీసు సిబ్బందికి శహకరించాలి అని కోరారు.ఈ నగదు కోసం ఎవ్వరు బయటికి రావద్దు అని మీ వాలంటీర్లు మీ ఇళ్లకే తీసుకు వచ్చి ఇస్తారు అని తెలియ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు, పెందుర్తి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ అన్నం రెడ్డి అజయ్ రాజ్,జిల్లా వైసిపి కార్యదర్శి చుక్క రామునాయుడు,మండల వైసీపీ అధ్యక్షుడు సీరిపురపు అప్పలనాయుడు, ఎఫ్ సి ఐ మెంబర్ పయిల సన్యాసి రాజు,పయిల హరీష్,పెద్దిసేట్టి శేఖర్,లబ్ధిదారులు,వాలంటీర్లు పాల్గొన్నారు.ఎమ్మెల్యే ప్రారంభించిన నగదు పంపిణీ కార్యకమాని వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రామునాయుడు వలంటీర్ల తో ఇంటి ఇంటికి తిరిగి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డోక్రా సి ఏ చుక్క లక్ష్మీ,యంగ్ మేన్స్ అసోసియేషన్ సభ్యులు పోతల అప్పలనాయుడు,గండి ఈశ్వరావు,గండి సన్యాసి రావు,రొంగలి అప్పాలనాయుడు,గండి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment