నిరుపేద పాస్టర్లకు నిత్యావసర సరుకులు ఆర్థిక సాయం.
కోరుకొండ, పెన్ పవర్ : మనోజ్ మెహతా
కోరుకొండ రివైవల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆద్వర్యంలో బురుగుపూడి గ్రామంలో గ్లోరి పేంతుకొస్తు చర్చి అద్యక్షులు రెవ. కె. నవీన్ పాల్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణలో భాగంగా లాక్ డౌన్ కారణంగా నిరుపేద పాస్టర్లకు కూరగాయలు, నిత్యావసర సరుకులు, ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా కోరుకొండ మండల రివైవల్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు కె. విజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారమే గుడ్ఫ్రైడే ప్రార్థనలు ఎవరింట్లో వాళ్ళే సామాజిక దూరం పాటిస్తూ ప్రపంచశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కె విజయ్ కుమార్, కె నవీన్ పాల్, సిహెచ్ ప్రశాంత్, డి జైపాల్, కె సన్ని బాబు తదితర పాస్టర్లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment