ఘనంగా రాజ్యాంగనిర్మాత జయంతి
మధురవాడ, పెన్ పవర్ : సునీల్
జనసేన పార్టీ 6 వ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి పోతిన అనురాధ ఆధ్వర్యంలో మన భారత దేశ రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి, కుల మతాల అడ్డుగోడలను చేరిపేసి, భావీ భారత పౌరలు అంత ఒక్కటే, వారి అభివృధే అసలైన దేశ అభివృధి అని భారత దేశాన్ని సన్మార్గంలో నడిపించిన శ్రీ బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా 6 వ వార్డ్ లో కొమ్మది విల్లేజ్, సాయిరాం కాలనీ, కె వన్ కాలనీ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమలా వేసి నివాళి అర్పించారు.. ఈ సందర్బముగా పోతిన అనురాధ కాలనీ వాసులకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డ్ జనసేన పార్టీ 6వ వర్డ్ అధ్యక్షులు సంతోష్ నాయుడు, పోతిన నానజీ, అప్పలరాజు మాస్టర్, నాగోతి ప్రకాష్, బేవర రాజు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment