Followers

ప్రజలను కాపాడేందుకు పరమేశ్వరుడు, ధన్వంతరీ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి


విజయనగరం, పెన్ పవర్


 


కరోనా వైరస్ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు పరమేశ్వరుడు, ధన్వంతరీ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అభిలషించారు. శుక్రవారం నాడు కొత్తగ్రహారం వేంచేసియున్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన రుద్ర హోమం, రుద్రాభిషేకం తో పాటు అధర్వణ వేదంలోని ప్రధానమైన క్రిమినాశక సూక్తము, రక్షా జ్ఞ సూక్తము అనుసరించి నిర్వహించిన హోమాలలో ఎమ్మెల్యే కోలగట్ల చేతుల మీదుగా వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఋత్విక్కులు జరిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ మానసిక ప్రశాంతతకు, భయ నివారణకు ధన్వంతరి మంత్రం మానవాళికి ఎంతో అవసరమన్నారు. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచమంతా అతలాకుతలమై ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి అన్నారు. కనపడే క్రిములు, కనపడని క్రిములు కూడా నాశనం చేసే శక్తి మంత్రానికి ఉందని మన పురాణాలు చెబుతున్నాయి అన్నారు. 30 కేజీల ద్రవ్యాలతో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య హోమాలు, అభిషేకాలు ఋత్విక్కులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త ఉడత కాశీ, రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మరియు న్యాయవాది టీవీ శ్రీనివాసరావు, ఆలయ ఈవో కె.వి.రమణ, ఋత్విక్కులు భమిడిపాటి రామ్ కుమార్ శర్మ, భమిడిపాటి రమేష్, కప్పగంతుల ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...