Followers

ఇటలీ నుంచి ఆంధ్రా విద్యార్థుల రాక

 



 


 ఇటలీ నుంచి ఆంధ్రా విద్యార్థుల రాక.


 ప్రత్యేక బస్ లో రాయపూర్ నుంచి విశాఖకు తరలింపు..


విజయనగరం,, పెన్ పవర్ ప్రతినిధి:
 బి డేవిడ్ రాజు


ఇటలీలో చదువుతున్న ఆంధ్రా ప్రాంతానికి చెందిన 23 మంది విద్యార్థులను రాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవతో  రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇటలీలో కరోనా(కోవిడ్ 19) వైరస్ వ్యాప్తి తీవ్రత ను గుర్తించిన ఆంధ్రా విద్యార్థులు స్వదేశానికి రావడానికి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్న దరిమిలా కేంద్రం స్పందించింది. దేశంలో కూడా కరోనా పాజిటివ్ కేస్ లు నమోదు అవుతున్న తొలిలో ఇటలీ నుంచి వచ్చిన ఈ ఆంధ్ర విద్యార్థులకు వైద్య  పరీక్షల అనంతరం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని రాయ పూర్ లో ప్రత్యేక క్వరంటైన్ లో ఉంచారు. వీరిలో ఎవరికీ ఎటువంటి కరోనా లక్షణాలు లేనట్టు నిర్ధారణ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వారిని వారి వారి స్వస్థలాలకు చేర్చే ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా ఆదివారం రాయ పూర్ నుంచి *ఏఎన్ టి* అనే ఒక ప్రత్యేక బస్ లో ఈ 23 మందిని జగదల్ పూర్, విజయనగరం మీదుగా విశాఖ పట్నం తీసుకు వచ్చారు. ఈ బస్ లో వచ్చిన 23 మంది విద్యార్థుల్లో విజయనగరం పట్నంకి చెందిన ఒక విద్యార్థి ఉండడంతో వైద్య, పోలీస్ అధికారులు సోమవారం మధ్యాహ్నం విజయనగరం చేరుకున్న బస్ లో నుంచి దిగిన విద్యార్థిని తమ స్వాధీనంలోకి తీసుకొని వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. మిగిలిన 22 మంది విద్యార్థులను అదే బస్ లో విశాఖ తరలి వెళ్లారు. ఈ బస్ కి ఎక్కడికక్కడ జిల్లా పోలీసులు ఎస్కార్ట్ గా వ్యవహరించారు. ఇదిలా ఉంటె విదేశాల నుంచి ఢిల్లీ కి అక్కడ నుంచి ప్రత్యేక కోవిడ్ ఐసోలేషన్ ట్రైన్ లో విజయనగరం వచ్చిన మరో 12 మంది స్వదేశీయిలను కూడా సోమవారం వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. పరీక్షల నివేదికలు వచ్చిన అనంతరం వీరిని తమ స్వగ్రామాల కి పంపనున్నట్టు అధికారులు చెప్పారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...