విశాఖ మన్యంలో ఐదేళ్ల చిన్నారిపై అమానుషం.
పాడేరు, (పెన్ పవర్):
అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై విశాఖ మన్యంలో సభ్య సమాజం తలదింతుకునే అమానుష ఘటన చోటుచేసుకుంది. ప్రశాంతతకు నిలయం అయిన మన్యంలో మానవ మృగాల సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. హుకుంపేట మండలం మాసాడ గ్రామ సమీపంలో గల గొందువలస గ్రామంలో ఐదేళ్ల చిన్నారిపై కొండబాబు(50) అనే మానవ మృగం కాటేశాడు. తినుబండారాలు ఆశ చూపి సమీపంలోగల పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచార ప్రయత్నం చేసాడు. పాప కనిపించకపోవడంతో వెతుకుతున్న తల్లికి పొదల చాటున ఏడుస్తూ కూతురు కనిపించింది.
దీంతో అక్కడి చేరుకున్న తల్లికి మానవ మృగం అయినా
కొండ బాబు కూతురుపై వెకిలి చేష్టలు చేస్తూ ఉండటం గమనించిన తల్లి
కొండబాబు కు దేహశుద్ధి చేయడంతో పారిపోయాడు. కూతురు ఎంతకీ ఏడుపు ఆగకపోవడంతో ఏమైందని గమనించిన తల్లికి
పాపకు రక్తస్రావం అవడం గమనించి... తల్లి లబోదిబోమంటూ ఏడూస్తుంటే
ఏమైంది అంటూ వచ్చిన గ్రామస్తులకు విషయం తెలియ పరిచింది. దీంతో ఆగ్రహం చెందిన గ్రామస్థులు ఈ మానవ మృగాన్ని వెతికి పట్టి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న ఎస్సై అప్పలనాయుడు ఎం డి ఓ ఇమ్మానియేల్ వివరాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా మనీషా వైద్య పరీక్షల నిమిత్తం ఎస్సై అప్పలనాయుడు ఆంబులెన్స్ రప్పించి. పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనపై మనిషా తల్లి మాట్లాడుతూ తన కూతురు కి జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.అలాగే మానవ హక్కుల పరిరక్షణ ప్రతినిధి
తపుల కృష్ణారావు మాట్లాడుతూ మన్యం లో ఇలాంటి మానవ మృగల సంఘటనలు జరగటం బాధాకరమని. తక్షణమే ఈ మానవ మృగాన్ని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.
No comments:
Post a Comment