లాక్ డౌన్ సమయం లో అందరూ పేదలకు సహాయం చేయాలి
అడ్డతీగెల, పెన్ పవర్
లాక్ డౌన్ సమయంలో ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకొని అందరూ తమ వంతున పేదలకు సహాయం చేస్తున్నారు. స్థానిక జుడిష్యల్ ఫస్ట్ క్లాస్ కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వరరావు బుధవారం పేదలకు సరుకులను పంపిణీ చేశారు. ప్రతిఒక్కరూ ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తూ , సామాజిక దూరం పాటించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు కరోనా వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. కోర్టు లాయర్లు శ్రీధర్, రమణ , ఎస్సైలు నాగేశ్వరరావు,బాబురావు పోలీసు సిబ్బంది , గ్రామస్థులు పాల్గొన్నారు
No comments:
Post a Comment