విజయనగరం, పెన్ పవర్
కరోనా వైరస్ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు, ధన్వంతరీ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అభిలషించారు. మంగళవారం నాడు పట్టణంలోని కొత్తగ్రహారం లో వేంచేసి ఉన్న శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన చండీయాగం లో ఎమ్మెల్యే కోలగట్ల పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య హోమగుండంలో వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో కూడిన వస్తువులను ఎమ్మెల్యే కోలగట్ల చేతుల మీదుగా వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఋత్విక్కులు జరిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల ప్రపంచమంతా అతలాకుతలమై ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి అని అన్నారు. కనపడే క్రిములు, కనపడని క్రిములు కూడా నాశనం చేసే శక్తి మంత్రానికి ఉందని మన పురాణాలు చెబుతున్నాయి అన్నారు. పార్వతీ పరమేశ్వరుల సన్నిధికి ఎదురుగా చండీ హోమం చేయడం వల్ల ప్రజలకు అంతా మంచే జరుగుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మరియు ప్రముఖ న్యాయవాది టీవీ శ్రీనివాస రావు దంపతులు చండీ హోమం కర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపార వేత్తలు ఉడతా కాశీ విశ్వనాథం, బలభద్రుని నానాజీ, కుమ్మరిగుంట శ్రీనివాసరావు, ఆలయ ఈవో కె.వి.రమణ, ఋత్విక్కులు భమిడిపాటి రామ్ కుమార్ శర్మ, భమిడిపాటి రమేష్, కప్పగంతుల ప్రసాద్ తదితరులు ఉన్నారు...
No comments:
Post a Comment