Followers

ప్రజలకు పోలీస్ హెచ్చరికలు

ప్రజలకు పోలీస్ హెచ్చరికలు

 

- ఇతరులకు ముప్పు వాటిల్లేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు

 

అనకాపల్లి, పెన్ పవర్ : సాయి రామ్ 

 

ప్రజల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను విధించాయని దీనిలో భాగంగా 144 సెక్షన్ అమల్లో ఉందనేది ప్రజలు గమనించాలని పోలీస్ అధికారులు ప్రకటన విడుదల చేశారు. కరోనా వ్యాధి నివారణ జరగాలంటే ప్రజలు సమూహంగా ఉండకూడదు. ఇది తెలిసి కొందరు అవగాహన లేక  కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎక్కడెక్కడ గుంపులు గా తిరుగుతున్న జనాలను డ్రోన్ కెమెరా తో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. వాళ్ళ పై కేసులు తప్పవని హెచ్చరించారు. ఆహారాన్ని పేదలకు పంపిణీ చేయాలని అనుకునేవారు కూడా పోలీసులకి ముందస్తు సమాచారం అందించాలన్నారు. పంపిణీ పేరుతో ఎక్కడికక్కడ జనం గుంపులుగా చేరుతుండడంతో ప్రజలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అన్నారు. ఆంటు వ్యాధుల చట్టం ప్రకారం వాళ్ళు నేరస్తులుగా పరిగణించవలసి వస్తుందన్నారు. ఇలాంటి సమయంలో వివాహాలు చేసుకోవడం తగదని  అత్యవసరమైతే జనం లేకుండా సంబంధిత అధికారుల అనుమతితో చేసుకోవాలన్నారు. వాహనాలతో పదేపదే రోడ్డుపై తిరిగే వారిపై కేసులు నమోదు చేశామని వారినుంచి అపరాధ రుసుమును కూడా వసూలు చేసినట్లు వివరించారు. ప్రజల ప్రాణాల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విధిగా పాటించకపోతే కేసులకు గురవుతారని హెచ్చరించారు. 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...