కరోనా నియంత్రణకు పటిష్టంగా నిఘా ఏర్పాట్లు
ఉద్యాన పంటల మార్కెటింగుకు ఇబ్బందులు లేకుండా చూడాలి
పరిశ్రమలు తెరవడంపై ఆయా యాజమాన్యాలతో చర్చించాలి : మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాలు
విజయనగరం, పెన్ పవర్ ప్రతినిధి : డేవిడ్ రాజ్
జిల్లాలో కరోనా నియంత్రణలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలతో సర్వే జరిపిస్తున్నామని వారి సర్వేలో వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నట్టు గుర్తించిన వారందరికీ రాపిడ్ టెస్ట్ కిట్లతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపించాలని రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. జిల్లాల్లో లాక్ డౌన్ నేపథ్యంలో ఉద్యాన పంటలు అరటి, మామిడి ఎగుమతులు, మార్కెటింగ్ కు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో కరోనా వ్యాప్తిని నిరోధించడం, లాక్ డౌన్ సడలింపులు, వ్యవసాయ ఉద్యాన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం తదితర అంశాలపై మంత్రి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో కరోనా కేసులు వున్నా లేకున్నా ఈ వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం సిద్దం చేసిన ఆసుపత్రులను పూర్తీ సన్నద్ధంగా ఉంచాలన్నారు.
జిల్లాలో కరోనా నియంత్రణ చర్యలపై జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ మంత్రికి వివరించారు. ఏప్రిల్ 20 నుండి కేంద్రం గ్రీన్ జోన్ లోని పరిశ్రమలను తెరిచే అంశంపై మంత్రి సమీక్షించారు. పూసపాటి రేగ ప్రాంతంలో వున్న ఔషధ తయారీ పరిశ్రమలను తెరిచే అంశంపై పరిశ్రమల యాజమాన్యాలతో చర్చించాలని కలెక్టర్ కు సూచించారు. పైడి భీమవరం ప్రాంత పరిశ్రమల్లోకి ఈ జిల్లా నుండి ఉద్యోగుల హాజరు విషయమై అక్కడి కలెక్టర్ తోనూ మాట్లాడాలని సూచించారు. పరిశ్రమలకు విశాఖ నుండి వచ్చే ఉద్యోగుల విషయాన్ని రాష్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాలని కోరారు. రైతుల అవసరాలకు సంబంధించిన ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల దుకాణాలు తెరచి ఉంటాయనే విషయాన్ని రైతులకు తెలియజేయాలన్నారు. జిల్లాలో మొక్క జొన్న కేంద్రాలకు సంబంధించి 30 కేంద్రాలు తెరచి ఉంచామని ఈ కేంద్రాల ద్వారా 13 వేల టన్నులు కొనుగోలు చేసామని జాయింట్ కలెక్టర్ వివరించారు.
జిల్లాలో ఉచిత పంపిణీకి ఉద్దేశించిన మాస్కుల తయారీ విషయమై డి.ఆర్.డి.ఏ., మెప్మా సంస్థల ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లను మంత్రి సమీక్షించారు. ఈ నెల 24న గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళలకు వడ్డీలేని రుణాలు అందించడానికి ఈ నెల 24 న ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లాలో రూ.35 కోట్లు స్వయంసక్తి మహిళలకు అందజేయనున్నట్లు డి.ఆర్.డి.ఏ. అధికారులు వివిరించారు.
సమావేశంలో శాసన సబ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి, వై.సి.పి.నాయకులు మజ్జి శ్రీనివాస రావు, ట్రైనీ కలెక్టర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్-2 ఆర్.కుర్మనాథ్, డి.ఆర్.ఓ. వెంకట రావు, డి.ఎం.హెచ్.ఓ. డా.రమణ కుమారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment