బండారు జన్మించిన నేల మీద పుట్టడం ఏడిద ప్రజల అదృష్టం..
పారిశుధ్య కార్మికులకు బియ్యం , చీరలు పంపిణీ..
మండపేట, పెన్ పవర్
సీపీఐ సీనియర్ నాయకులు బండారు లక్ష్మణ స్వామి జన్మించిన నేల మీద పుట్టిన ఏడిద ప్రజలంతా ఏనాడో చేసుకున్న పుణ్యమని పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు మేడిద సూర్య భాస్కర రావు అన్నారు. మండలంలోని ఏడిద పంచాయితీ లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు సీపీఐ పార్టీ ఆపన్న హస్తం అందించింది. శనివారం రథం వీధిలోని పాఠశాలలో నిర్వహించిన పంపిణీ కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు బండారు లక్ష్మణ స్వామి పూర్వాశ్రమ శిష్యుడు భాస్కరరావు మాట్లాడుతూ కమ్యూనిస్ట్ నాయకుడిగా లక్ష్మణ స్వామి అనేక పోరాటాలు చేశారన్నారు. సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి ఆయన విశేష కృషి చేశారన్నారు. పూర్వం రోజుల్లో పంచాయితీ కార్మికులకు కనీస వేతనం కూడా ఇవ్వకుండా అనేక బాధలు పెట్టేవారన్నారు. అలాంటి సమయంలో బండారు వారికి వెన్నుదన్నుగా నిలిచారని అన్నారు. అలాగే ఇక్కడ పేదల సమస్యల పట్ల ఇళ్ళ పట్టాల విషయంలో బండారు చేసిన పోరాటం ఎప్పటికీ గుర్తు ఉంటుంది అన్నారు. లక్ష్మణ స్వామి మాట్లాడుతూ రైతన్న తర్వాత పారిశుధ్య కార్మికులే అసలైన దేవుళ్ళు అని వారి సేవలను కొనియాడారు
No comments:
Post a Comment