అధికారులకు కోడిగుడ్లు పంపిణీ
గోకవరం పెన్ పవర్
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం వైసిపి నాయకులు గుండా ప్రసాద్ ఆధ్వర్యంలో గోకవరం గ్రామంలో ఎంపీడీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకి అలాగే తాసిల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వారికి ఎంపీడీవో కిషోర్ కుమార్, చేతుల మీదగా కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీ నాయకులు గుండా శివ ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ. ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, ఆదేశాల మేరకు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు ఎంపీడీవో కార్యాలయంలో కోడిగుడ్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. అలాగే కరోనా వైరస్,లాక్ డాన్, కొనసాగుతున్న తరుణంలో తమ వంతు సాయంగా నిత్యం విధినిర్వహణలో నిమగ్నమై ఉన్న ఎంపీడీవో, ఎమ్మార్వో ,కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి గ్రామ వాలంటరీలకు ఆశా వర్కర్లకు,పారిశుద్ధ్య కార్మికులకు పంచాయతీ సిబ్బందికి,తమ వంతు చిరు సహాయం అందిస్తున్నామని గూండా శివప్రసాద్, అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైసిపి నాయకులు కార్యకర్తలు పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment