Followers

పోలీసు సిబ్బందికి ఏకరూప దుస్తులు పంపిణీ చేసిన పి ఎస్ రాజు


పోలీసు సిబ్బందికి ఏకరూప దుస్తులు పంపిణీ చేసిన పి ఎస్ రాజు


             పరవాడ పెన్ పవర్

 

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కరోనా నుంచి ప్రజలను కాపాడటం కోసం మండలం పోలీస్  స్టేషన్ పరిధి లోని 76 మంది సిబ్బంది కి వైసిపి జెడ్పిటిసి అభ్యర్థి పయిల సన్యాసి రాజు కాకీ ఏకరూప దుస్తులను సోమవారం నాడు ఉచితంగా పంపిణీ చేశారు.స్టేషన్ సర్కిల్ ఇంస్పెక్టర్ రఘువీర్ విష్ణు కి ప్రథమంగా దుస్తులను రాజు అందజేశారు.అనంతరం సన్యాసి రాజు మాట్లాడుతూ కరోనా నుండి ప్రజలను కాపాడ టానికి నిద్రాహారాలు మాని అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసు సిబ్బంది లో ప్రతివక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు.ప్రజలంతా కూడా పోలీసు సిబ్బంది చెప్పినట్లు వారి ఇళ్లనుంచి బయటకు రాకుండా కరోనా నివారణకు శహకరించాలి అని కోరారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...