ఏజెన్సీలో మలేరియా సీజన్ ప్రారంభం.
గిరిజనులు అప్రమత్తంగా ఉండాలి.
11 మండలాల్లో మందు స్ప్రేయింగ్.
జిల్లా మలేరియా నిర్మూలన అధికారి మణి.
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్) విశాఖ
ఏజెన్సీలో మలేరియా సీజన్ ప్రారంభమైందని గిరిజనుల్లో అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా నిర్మూలన అధికారి మణి అన్నారు. మంగళవారం ఆయన కొయ్యూరు జి.మాడుగుల తదితర మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోన వైరస్ లాక్ డౌన్ ఒకవైపు కొనసాగుతుందని మరోవైపు మలేరియా విస్తరిస్తున్న దని దీని పట్ల కూడా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొయ్యూరు మండలం యూ చీడిపాలెం వేమన పాలెం గ్రామాల్లో మలేరియా పాజిటివ్ తో గిరిజనుడు మృతిచెందాడని మరో నలుగురికి మలేరియా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాన్ని సందర్శించి మలేరియా నిర్ధారణకు రక్త కూతలు సేకరిస్తున్నామన్నారు. రోగులకు మలేరియా నివారణ మందులను అందజేస్తున్నారు. మలేరియా ప్రబలకుండా ఏజెన్సీలోని అన్ని మండలాల్లో మందు స్ప్రేయింగ్ జరుగు తుందన్నారు. గిరిజనులు ఇంటి లోపల వెలుపల మందు పిచికారీ చేయించుకోవాలని కోరారు. దోమల బెడద తగ్గించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. మలేరియా రాకుండా గిరిజనులు పరిసరాల శుభ్రత పాటించాలని మణి సూచించారు.
No comments:
Post a Comment