తెదేపా ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు
అనకాపల్లి, పెన్ పవర్
అరుంధతి నగరంలో బాబు జగ్జీవన్ రావ్ జయంతి సందర్భంగా శాసనమండలి సభ్యులు బుద్థ నాగ జగదీశ్వరరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ దిశానిర్దేశం చేసే లోక్ సభ స్పీకర్ గా ఒక దళితనేతను చేసిన పార్టీ తెలుగుదేశం అనారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్ గా ఒక దళిత మహిళానేతను గౌరవించిన పార్టీ తెలుగుదేశం బడుగు, బలహీన వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేసిన పార్టీ తెలుగుదేశం అనారు. జగ్జీవన్ జ్యోతి పథకం కింద ఎస్సీల ఇళ్ళకు 100 యూనిట్ల ఉచిత కరెంటు ఇచ్చాం. డప్పు కళాకారులకు ప్రతి నెలా రూ.1,500 పింఛను ఇచ్చాం. ఎస్సీల సంక్షేమానికి 4ఏళ్లలోనే రూ.40,253 కోట్ల బడ్జెట్ పెట్టాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 6.56 లక్షల మందికి జీవనోపాధులు కల్పించామనారు. ఈ కార్యక్రమంలో బోడ్డేడ జోగినాయుడు,మళ్ళ సురేంద్ర,కొణతాల జగ్గారావు నాయుడు,బోడ్డేడ మురళీ, బుద్థ శ్రీను, పెట్ల సత్యనారాయణ,పోలమరశెట్టి వేణు,దొడ్డి జగదీశ్వరరావు,కొణతాల తులసి,అరుంథతి నగర్ కాలని వాసులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment