ప్రపంచంతా కరోనా వైరస్ నివారణకై అహోరాత్రులు కష్టపడుతున్న ప్రజాప్రతినిధులును మనం చూస్తున్నామని కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కక్ష సాధింపు చర్యలకు ఏ విధంగా చేయాలి ఎలా లబ్ధి పొందాలి అనే ఆలోచనా ధోరణితో పరిపాలించడం నియంతృత్వ పోకడలకు అద్దం పడుతుందని శాసనమండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు విమర్శించారు. లక్షలాది మంది ప్రజలు చనిపోతున్నారని నివారణకై ఎటువంటి చర్యలు తీసుకోవాలి ప్రజలను ఎలా కాపాడాలి ఆలోచన లేకుండా రాజకీయ కక్షలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజ్యాంగ పదవులు నిబంధనలకు విరుద్ధంగా ఆర్డినెన్స్ రూపంలో ఐదు సంవత్సరాల కాలాన్ని మూడు సంవత్సరాలకి మారుస్తూ జీవో ఇచ్చారనారు. తన మాట వినడం లేదనే కక్షతోనే ఎన్నికల వాయిదా వేసారని కుల ప్రస్తావనతో విమర్శలు చేశారు. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతున్న అధికారులను సస్పెండ్ చేస్తున్నారని మంచి ఆలోచన ఎక్కడా కనబడటం లేదనారు. కరోనా వైరస్ చాలా సాధారణమైన వ్యాధిలాగా బాధ్యతారహితంగా మాట్లాడుతూ వ్యాధి తీవ్రతను గుర్తించిన ప్రపంచ దేశాలు గడగడ లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ చంద్రబాబు నాయుడిపై అవాకులు చవాకులు పేలుతున్నారనారు. హైదరాబాద్ నుంచి వస్తే 14 రోజులు కార్వానెంట్ లో ఉండాలని చెప్పిన మంత్రులు ముందుగా విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లినందున ముందు మంత్రిని హైదరాబాదులో కార్వానెంట్ లో 14 రోజులు ఉండే ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నం చేయకుండా వైరస్ బాధితులను గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతి ఇంటికి సర్వే హై టెంపరేచర్ మిషన్ తో ప్రతి వ్యక్తిని తనిఖీ చేసి వ్యాధి లక్షణాలు ఉంటే ఆస్పత్రికి తరలించాలని ఆవిధంగా చేయకుండా ఆశా వర్కర్లు ఏఎన్ఎంలుతో వాలంటీర్లతో తూతూమంత్రంగా సర్వే చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులను మాత్రం చెల్లించి కమిషన్ కొట్టేసింది అన్నారు.
No comments:
Post a Comment