కష్టకాలంలో కళాకారులకు నేనున్నాను : మావూరి..
ఆరిలోవ. పెన్ పవర్ ప్రతినిధి కూచిపూడి భాస్కర్ కుమార్
విశాఖపట్నం సిటీ విశాఖపట్నంలో ఎటువంటి విపత్తులు సంభవించిన నేనున్నానంటూ ఆపన్నహస్తం అందించె మా ఊరి వెంకటరమణ మరోసారి ఆయన సేవలు నగరానికి అందిస్తున్నారు, అందులోబాగంగా కరోనా వలన నగర కళాకారులు పడుతున్న బాధలు ఆయనను కచివేసాయి,ఈ రోజు సి ఎం ఆర్ షాపింగ్ మాల్ ల ప్రాంగణంలో కళాకారులకు నిత్యావసర వస్తువులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి వలనఅనేకమంది ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటి వారిని గుర్తించి తమవంతు సహాయం అంద చేయడం జరిగిందని, ప్రజలు ధైర్యంగా ఉండాలని ప్రభుత్వ సూచనలు పాటించి వ్యక్తిగత పరిశుభ్రత, వ్యక్తి వ్యక్తి మద్య దూరం పాటించాలని,ఇలాంటి సమయంలో మరికొంత మంది దాతలు ముందుకు వచ్చి ప్రజలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో కళాకారుల సంఘం ప్రతినిధి చెన్నా తిరుమల రావు తదితరులు పాల్గొన్నారు.:
No comments:
Post a Comment