ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడు చేసుకోండి
కమీషనర్ నూకేశ్వర రావు
సాలూరు, పెన్ పవర్
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆరోగ్య సేతు యాప్ గురించి అందరు తెలుసు కోవాలని సాలూరు పట్టణ మున్సిపల్ కమీషనర్ గురువారం చిన్నబజార్ జంక్షన్లో కిరాణ షాపుల యాజమానులుకు అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతు ఈ ఆరోగ్య సేతు యాప్ వలన ఎంతో ఉపయెాగం ఉందని,యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.హెల్ప లైన్ నంబర్ లతో పాటు ,ఆరోగ్య శాఖ పెట్టే పోస్టులు,వైద్య సలహలు ఇతర వివరాలు తెలుసుకోచ్చని తెలిపారు.కరోనా సోకిన వ్యక్తి దగ్గర గా వెళ్తే వెంటనే ఈ యాప్ మనల్ని వెంటనే అప్రమత్తం చేస్తుందని,ఇప్పుడు ఉన్న ప్రస్తుత కరోనా కేసులను పసిగడుతుందని చెప్పారు.తదనాంతరం కిరాణ షాపు యజమానులుకు,ప్రజలకు తమ సెల్ ఫోన్ లో ఆరోగ్యసేతు యాప్ ఎలా డౌవున్ లోడు చెయ్యలో దాని పనితీరును దగ్గర ఉండి సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ నూకేశ్వరరావు,సిబ్బంది పాల్గోన్నారు.
No comments:
Post a Comment