పేదల పక్షపాతి సిఎం జగన్
ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్
పెన్ పవర్, నర్సీపట్నం
కష్టాల్లో ఉన్న పేదప్రజలను ఆదుకునేందుకే జగన్మోహన్ రెడ్డి ఏర్పడిందని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అన్నారు. ఇంటింటికీ వెయ్యి రూపాయలు పంపిణీ నాతవరం మండలం ములగపూడి నుండి ఆయన ప్రారంబించారు. గడపగడపకు వెళ్ళి ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గంలో తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులకు 8,24,72,000/- పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో, పేద ప్రజల ఇబ్బందులను గుర్తించి రేషన్ డిపోల ద్వారా బియ్యం, పప్పులు అందజేశారని, ఇప్పుడు చేతి ఖర్చుల కోసం తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 1000 రూపాయలు ఇస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో 78 సచివాలయాల పరిధిలో 82,472 రేషన్ కార్డులు ఉన్నాయని, ఒక్కొక్క కుటుంబానికి వెయ్యి రూపాయల చొప్పున 8,24,72,000/- పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ మరికొద్ది రోజుల పాటు ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ఇంట్లోనే ఉండాలని, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ములగపూడిలో జరిగిన కార్యక్రమంలో అంకంరెడ్డి జమ్మీలు, సుర్ల సత్యన్నారాయణ, మండల వైసిపి నాయకులు, వాలంటీర్లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment