లాక్ డౌన్లో ఉన్న పేద కుటుంబాలకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు సెయింట్ జోసఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్థిక సహాయంతో కూరగాయలు శానిటేషన్ కిట్లు పంపిణీ చేశారు
పెన్ పవర్ గోపాలపురం : రాము
కరోనా వైరస్ ప్రభావంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదల పట్ల మేము సైతం అంటూ మానవతా స్వచ్ఛంద సంస్థ మరియు సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం తమ దాతృత్వాన్ని చాటారు. శుక్రవారం మండలంలోని పెద్దాపురం వెల్ల చింతగూడెం గ్రామాలలో 200 పేద కుటుంబాలకు కూరగాయల కిట్లను అందజేశారు. అదేవిధంగా గ్రామ సచివాలయం పరిధిలోని వేల చింతగూడెం పెద్దాపురం గ్రామ వాలంటీర్లకు శానిటైజరులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మానవతా గోపాలపురం మండలం సంస్థ అధ్యక్షులు మురళి, నెల్ల చంద్రశేఖర్, పద్మ సాయి ఫైనాన్స్ బాబ్జి, గుబ్బ లక్ష్మణరావు, మడిచర్ల గోపి, సెయింట్ జోసెఫ్ సిబ్బంది సిస్టర్ జూలియా,సిస్టర్ జానెట్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment