భవన నిర్మాణ రంగ పనులకు అనుమతులు ఇవ్వాలి
సాలూరు, పెన్ పవర్
సాలూరు పట్టణ ఎ.పి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కమిటీ సి.ఐ.టి.యు జిల్లా ఉపాధ్యక్షుడు యన్.వై. నాయుడు ఆధ్వర్యంలో పట్టణ యస్.ఐ. యస్.శ్రీనువాసరావు కు కరోనా వలన నెల రోజులుగా నిర్మాణ రంగ పనులు నిలిచిపోయి కార్మికుల ఇబ్బందులు తెలుపుతున్న వినతిపత్రాన్ని గురువారం అందించారు.ఈ సందర్భంగా ఎన్.వై. నాయుడు విలేకర్ల తో మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి భవన నిర్మాణ రంగ పనులు పూర్తిగా నిలిచిపోయాయని,ప్రస్తుతం కార్మికులకు ఉపాధి పనులు లేకపోవడం వలన అవస్థ లు పడుతున్నారని, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందకపోవడం నిర్మాణ రంగ కార్మికులు పస్తులు ఉండవలసిన పరిస్థితి నెలకొని ఉందని చెప్పారు. ఏప్రెల్ 29 వ తేదీనా రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ రంగ పనులు చేయడానికి అనుమతిస్తు ఆదేశాలు జారీ చేసిందని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి, డి.జి.పి. ప్రకటించి యున్నారని తెలిపారు.సాలూరు పట్టణ కార్మికులు కూడా సామాజిక దూరం పాటిస్తూ పనులు చేసుకొనేందుకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నట్లుగా చెప్పారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ రంగ కార్మిక అధ్యక్షుడు రౌతు చిన్నయ్య ,కార్యదర్శి యర్రా జగన్నాధం , కోశాధికారి నెయ్యల మెాహన్ తదితరలు పాల్గొన్నారు .
No comments:
Post a Comment