అత్యవసర పరిస్థితుల్లో అద్దెకు ఆర్టీసీ బస్సులు.
పెన్ పవర్ స్టాఫ్ రిపోర్టర్ మజ్జి శ్రీనివాస మూర్తి, విశాఖపట్నం
అత్యవసర పరిస్థితుల్లో ఆర్టీసీ బస్సులు అద్దెకు కేటాయిస్తామని వాల్టేర్ డిపో మేనేజర్ గంగాధర్ రావు తెలిపారు. కరోనా వైరస్ లాక్ డౌన్ సందర్భంగా అత్యవసర పరిస్థితుల్లో బస్సులు అవసరమైతే డిపో లో సంప్రదించాలని ఆయన కోరారు. నిత్యవసర సరుకులు తరలించడానికి ఇతర అత్యవసర పరిస్థితుల్లో అవసరమైతే ఆర్ టిసి బస్సులను బడుగుకి ఇస్తామన్నారు.
మే 3 వరకు ఆర్టీసీ బస్సులు తిరగవు, మే నెల మూడవ తేదీ వరకు ఆర్టీసీ బస్సులు తిరగవని ఆ సంస్థ ఈ డి .కె ఆర్.బి రెడ్డి తెలిపారు.కరోనా లాక్ డౌన్ కారణంగా మే 3 వరకు రెండో విడత లాక్ డౌన్ పొడిగించడం తో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. తదుపరి ఆదేశాలు అనంతరం ఆర్టీసీ బస్సులు నడుపుతామని రెడ్డి తెలిపారు. ప్రస్తుతం కార్గో సర్వీస్ నామమాత్రం గా కొనసాగిస్తున్నామని చెప్పారు. రిజర్వేషన్లు చేయించుకున్న వారి నగదు రిటన్ చేస్తున్నామని రెడ్డి తెలిపారు.
No comments:
Post a Comment