కాటూరి రవీంద్ర దాతృత్వం
- మూగజీవాలకు పశుగ్రాసం అందజేత
-కరోనా సంక్లిష్టంలో మూగజీవాలను ఆదుకోవాలని పిలుపు
మధురవాడ, పెన్ పవర్: సునీల్
కరోనా వైరస్ తాండవిస్తున్న సంక్లిష్ట పరిస్థితుల్లో అన్నార్తులకు ఆపన్న హస్తంగా నిలిచి అనేక కుటుంబాలలో కాంతులను వెలిగిస్తున్న కాటూరి సూరన్న చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం... ట్రస్ట్ నిర్వాహకులు, బీజేపీ సీనియర్ లీడర్ కాటూరి రవీంద్ర కరోనా అన్నార్తుల పాలిట దేవుడిగా నిలుస్తున్నారు... లాక్ డౌన్ ప్రారంభం నుండి నేటి వరకు చేతికి ఎముక లేదన్న చందాన అభాగ్యులను ఆదరిస్తూ...ప్రస్తుత కరోనా కాటీణ్యంలో ఆకలితో అలమటిస్తున్న అన్నార్తులను నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు..ఇంతే కాకుండా మూగజీవాలకు కూడా తానున్నానంటూ కాటూరి రవీంద్ర ప్రతీ రోజు ప్రత్యేక కార్యక్రమం చేస్తూ మూగజీవల పాలిట దైవంగా నిలుస్తున్నారు...పశుగ్రాసం లేక రోడ్ల పై ఆకలితో అలమటిస్తున్న ఆవులు,గేదలను గుర్తించి వాటికి పశుగ్రాసం అందిస్తున్నారు.. అందులో భాగంగా సోమవారం కూడా సీతమ్మధార,వెంకజిపాలెం,హెచ్,బీ కాలనీ,చిన వాల్తేర్,జగదాంబ ప్రాంతాలలో మూగజీవలైన ఆవులు,గేదెలకు పశుగ్రాసం ఆయన చేతుల మీదుగా వేశారు...ఈ సందర్బంగా కాటూరి రవీంద్ర మాట్లాడుతూ తన తాత గారైన కాటూరి సూరన్న చారిటబుల్ ట్రస్ట్ పేరిట గత 20 ఏళ్లుగా సేవా కార్యక్రామాలు నిర్వహిస్తున్నామని అన్నారు..ప్రస్తుత కరోనా భయానక పరిస్థితుల్లో తన సంస్థ పేరిట అన్నార్తులకు,ప్రజలకు సేవ చేస్తున్న పోలీస్, వైద్యులు,పారిశుధ్య కార్మికులకు సుమారు 2000 మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినట్లు తెలిపారు..లాక్డౌన్ ముగింపు వరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటామని అన్నారు.. ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దాతలు ప్రజలకు సాయం చేయడానిక్ ముందుకు రావాలని పిలుపినిచ్చారు
No comments:
Post a Comment