క్వారంటైన్ వ్యతిరేకంగా అప్పుఘర్ ప్రజలు ఆందోళన.
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం(పెన్ పవర్)
జనావాసాల మధ్య క్వారంటైన్ ఏర్పాటుని వ్యతిరేకిస్తూ అప్పు ఘర్ ప్రజలు సోమవారం రాత్రి రోడ్డుపై ఆందోళన చేపట్టారు. నగరంలో పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల దృష్ట్యా ఎంవిపి లో ఉన్న ఏపీ టూరిజం మరియు హరిత హోటల్ ను క్వారంటైన్ కు కేటాయిస్తూ విశాఖ జాయింట్ కలెక్టర్ శివ శంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అక్కడ ఏర్పాటు చేస్తుండగా అప్పు ఘర్ ప్రజలు వ్యతిరేకించారు. ప్రజలు తిరిగే ప్రదేశాల్లో క్వారంటైన్ ఏర్పాటు చేయడం వల్ల తమకు ఇబ్బందికరంగా ఉంటుందని అడ్డుతగిలారు. అధికారుల వినిపించుకోలేదని రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితి చక్కదిద్దారు.
No comments:
Post a Comment