నగర పరిధిలో కరోనా కేసులు పునరాగమనం అవుతున్నందున
పరిసరాలలో రసాయనాల జల్లడం విస్తృతం చేయాలి
- జివిఎంసి కమిషనర్ డా.జి.సృజన
విశాఖపట్నం , పెన్ పవర్
జివిఎంసి పరిధిలో గత కొద్ది రోజుల్లో కరోనా కేసులు తిరిగి పునరావృతం అవుతున్నాయి గావున, కార్పోరేషన్ పారిశుద్ధ్య విభాగపు అధికారులు, అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావుని, చీఫ్ మెడికల్ మరియు హెల్త్ ఆధికారి డా.కె.ఎస్.ఎల్.జి.శాస్త్రిని, బయాలజిస్టు పైడిరాజుని జోనల్ స్థాయి అసిస్టెంటు మెడికల్ అధికారులను, అప్రమత్తం చేస్తూ, నగర పరిధిలో ముఖ్యంగా కంటైన్మెంటు ప్రాంతాలలో సోడియం హైపోకోరైట్ ద్రావణం, బ్లీచింగ్ కలిపిన సున్నం మొదలగు రసాయనాలను ప్రతీరోజు విస్తృతంగా జల్లించుటకు చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. అదేశాలకు లోబడి, జివిఎంసి బయాలజిస్టు పైడిరాజు ఆధ్వర్యంలో, మధురవాడ జోన్ ఏరియా నుండి అనకాపల్లి జోన్ వరకు గల ముఖ్య ప్రాంతాలలో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని వాహానముల ద్వారా, మానవసహిత ట్యాంకుల ద్వారా చల్లించారు. బ్లీచింగ్ పౌడరును మురికివాడల్లో గల ఇరుకైన సందులలో పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా చల్లించారని బయాలజిస్టు ఒక ప్రకటనలో తెలిపారు.
No comments:
Post a Comment