కారోనా వైరస్ సోకి-చేలోనే రాలిపోతున్న పంట.
-దిక్కుతోచని స్థితిలో రైతు.
-రైతులను కుంగదీస్తున్నా కరోనా
పెన్ పవర్ కూనవరం.
ఒక్కసారి భూదేవి తల్లిని పట్టుకొని చూడు భూదేవి తల్లి నిన్ను లాగేసుకుంటుంది, నీవు వదులుదం అనుకున్న నీవే వదలవు అని మహర్షి సినిమాలో రైతు హీరోకు దిశానిర్దేశం చేస్తాడు. వాస్తవంగా రైతు కాడే పట్టి హల్లంను దున్ని వ్యవసాయం చేస్తూ ఆరుగాలం కష్టపడి తాను పెట్టిన పెట్టుబడి రాకపోయినా తాను పట్టిన భూమిని మాత్రం వదలడు రైతు. ఎక్కడో పుట్టిన మహమ్మారి కరోనా వైరస్ వలన రైతు అష్టకష్టాలు పడవలసి పరిస్థితి ఎదురయింది. ఏమి చేయాలో తెలియని దిక్కుతోచని స్థితి. కూనవరం, ఎటపాక రెండు మండలాల్లో అధికంగా సాగు చేసే పంట మిర్చి. మిర్చిని కోత కోసే అందుకు రెండు మండలాలకు అధికంగా చత్తీస్ ఘడ్, ఒరిస్సా నుండి అధిక సంఖ్యలో కూలీలు వచ్చి కోత కోసి వెళతారు. వైరస్ వలన రెండు ప్రాంతాల నుండి కూలీలు రాకపోవడం, పక్క మండలాల నుండి కూలీలను రానివ్వకపోవడం, బయటకు వస్తే వైరస్ సోకుతుంది ఏమోనని స్థానికంగా ఉన్న కూలీలు. కళ్ళముందు పంట రాలిపోవడం, ఓవైపు కూలీలు రాకపోవడంతో స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక రైతు ఆరవ వెంకట రామారావును పెన్ పవర్ కలవగా కూలీలు రాకపోవడంతో చేతికి అందివచ్చిన పంటంతా చేలోనే నేల రాలుతుందని, ఇదే విధంగా కొనసాగితే కరోనా మహమ్మారి రైతులను దహించివేస్తుందని ఆవేదన వెళ్లగక్కారు. ఎకరాకు సుమారు లక్ష నుంచి లక్షా 20వేల వరకు పెట్టుబడి అవుతుందని, అంతా బాగుంది, గిట్టుబాటు ధర ఉంది అనుకునే సమయంలో మిర్చి రైతును మహమ్మారి వైరస్ కుంగదీసిందని తెలిపారు. రైతులకు అధికారులు సహకరిస్తున్న కూలీలు రాకపోతే వారు మాత్రం ఏమి చేస్తారని అన్నారు. ఇదేవిధంగా పది రోజులు కొనసాగితే రైతు అనేవాడు ఉండని వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment