రామన్న అన్నదాన క్రతువు లో ఐదో రోజు
యువ ఎంపీని అభినందిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు
శ్రీకాకుళం , పెన్ పవర్
భవానీ ఛారిటబుల్ ట్రస్ట్ నేతృత్వాన చేపట్టిన రామన్న అన్నదాన క్రతువు గురువారంతో నాల్గో రోజుకు చేరుకుం ది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాకౌట్ ప్రకటించినందున అన్నార్తులకు, రిమ్స్ రోగులకు పట్టెడన్నం పె ట్టేందుకు యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు నిర్ణయించారు. ముఖ్యంగా రిమ్స్ రోగులకు వారి సహాయకులకు అ న్నం అందక ఆకలితో అలమటిస్తున్న వైనం పై ఎంపీ వెనువెంటనే స్పందించి కలెక్టర్ తో చర్చించి తన తరఫున వారిని ఆదుకు నేందుకు ఈ క్రతువుకు శ్రీకారం దిద్దారు. రామసేన సభ్యులు, ప్రజాసదన్ నిర్వాహకుల సమష్టి కృషితో గడిచిన మూడు రోజులూ వీరు అందిం చిన భోజనమే వారి ఆకలి తీర్చింది. ముఖ్యంగా బుధవారం నుంచి రాత్రి వేళల్లో కూడా భోజనం అందించేందుకు ఎంపీ రామూ నిర్ణ యించడంతో ఇంకాస్త సమస్య పరిష్కారం అయింది. దీంతో రోగులూ, అన్నార్తులూ ఆనందం వ్యక్తం చేశారు. తమ గోడు ఎవ్వరికీ ప ట్టని నేపథ్యాన ఎంపీ రామూ ఆదుకోవడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రామూ మాట్లా డుతూ దేశ వ్యాప్తంగా అల్లకల్లోల వాతావరణం ఉన్నందున నిరాశ్రయులకూ, అన్నార్తులకూ ఈ పండుగ వేళ పట్టెడన్నం పెట్టడం తనకెంతో ఆ నందంగా ఉందని చెప్పారు. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.
No comments:
Post a Comment