బ్యూరో రిపోర్ట్ విజయనగరం, పెన్ పవర్ : డేవిడ్ రాజు
కరోనా మీద యుద్ధంలో మీరు అందిస్తున్న సేవలు చాలా ప్రశంసనీయం, చాలా ఎక్కువగా కష్టపడుతున్నారు, సర్వీసు ఇస్తున్నారు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది హృదయపూర్వకంగా సేవలు అందిస్తున్నారు' అని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, కోవిడ్ ఆస్పత్రుల వైద్యులతో సీఎం శ్రీ వైయస్.జగన్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అంకిత భావంతో మన రాష్ట్రంలో సేవలు అందిస్తున్నారు: లాక్‌డౌన్ నుంచి, అంతకుముందు నుంచి కూడా మంచి సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రానికి సంబంధించి నాలుగు క్రిటికల్ కేర్ ఆస్పత్రుల్లో ఉత్తమ వైద్య సేవలను అందించడానికి గుర్తించామని జిల్లాల్లోని కోవిడ్ ఆస్పత్రులు, అలాగే క్రిటికల్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా వైద్యసేవలు అందించే క్రమంలో రిస్కు ఉంటుందని తెలిసినప్పటికీ కూడా చాలా కష్టపడి ఈ సేవ చేస్తున్నారని పేర్కొన్నారు. తెలియని భయం ఉన్నప్పటికీ కూడా మీరు వైద్య సేవలు అందిస్తున్నందుకు సెల్యూట్ చేస్తున్నానని అన్నారు.
ఢిల్లీ నుంచి వచ్చిన వారి కారణంగా కేసులు సంఖ్య పెరిగింది: పూర్తిగా వారందరి ఆచూకీ తెలుసుకొని వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌ను, సెకండరీ కాంటాక్ట్స్‌ను పూర్తి క్వారంటైన్ లేదా ఐసోలేషన్‌లో పెట్టామన్నారు. మొత్తమ్మీదకు చూస్తే పరిస్థితి అదుపులో ఉందనే చెప్పుకోవచ్చని సి.ఎం. తెలిపారు. రాబోయే రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని నమ్ముతున్నానని అన్నారు. మీరందిస్తున్న సేవలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నానని చెప్పారు. జిల్లా కలెక్టర్ డా ఎం హరిజవహర్ లాల్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ కేతన్ గార్గ్ కలెక్టర్ కార్యాలయం నుండి, జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. సీతారామ రాజు, వై.ఎస్.ఆర్.ఆరోగ్యశ్రీ సమన్వయ అధికారి డా ప్రియాంక, ఆర్.ఎం.ఓ. గౌరీశంకర్ రావు, డా. మధుకర్, ఇతర వైద్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment