గోకవరం లో అంబేద్కర్ జయంతి వేడుకలు.
గోకవరం పెన్ పవర్: శివరామకృష్ణ
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 129వ జయంతి వేడుకలు మంగళవారం గోకవరంలో పంచాయతీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గోకవరం పంచాయతీ కార్యాలయం ఆవరణలో అంబేద్కర్ చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ దేశంలో దళిత బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలు మరోవ రాదన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం డి ఎల్ పి ఓ జాన సత్యనారాయణ, గోకవరం ఎంపీడీవోకె. కిషోర్ కుమార్, తాసిల్దార్ కె. పోసి బాబు, ఈ ఓ పి ఆర్ డి ఓ రాజేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి టి. శ్రీనివాసరావు మాజీ జడ్పీటిసి గొల్లా ఏడుకొండలు, మాజీ ఎంపీపీ ఇది అశోక్, వైయస్సార్ సిపి నాయకులు వరసాల ప్రసాద్, కర్రి సూరారెడ్డి, చింత అనిల్ కుమార్, దాసరి రమేష్, సుంకర రమణ, బాతు ఆనంద్, ఇ. కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment