గాజువాక, పెన్ పవర్
లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న జర్నలిస్టు కుటుంబాలను ఆదుకునేందుకు గాజువాక పారిశ్రామిక ప్రాంతంలోని జర్నలిస్టుల సంఘం ముందుకు వచ్చింది. దాతల నుండి విరాళాలను సేకరించి నిత్యావసరాలను సమకూర్చింది. ఆదివారం గాజువాక వుడా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి చేతులమీదుగా విలేకరులకు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జర్నలిస్టులు పితాని సూర్యప్రసాద్, కె రాము, పరశురాం, గిరిబాబు, శేషు, శశి, గుప్తా, కృష్ణ, ఆధ్వర్యంలో దాతల నుండి విరాళాలు సేకరించడంలో కృషి చేశారు. ఈ కార్యక్రమంలో తిప్పల వంశీ రెడ్డి, తిప్పల దేవన్ రెడ్డి, దాతలు వర్మ, వారణాసి దినేష్ రాజ్, లక్కరాజు సోంబాబు, లేళ్ల కోటేశ్వర రావు, గంధం శ్రీనివాస్, మురళి దేవి, ట్వింకిల్ శ్యామ్ తదితరులు నిత్యావసరాలను అందజేశారు. సీనియర్ జర్నలిస్టులు కృష్ణ, కృష్ణ శ్రీ, కుప్పిలి సూర్యప్రసాద్, మోడేకురు సత్యనారాయణ, హెచ్ రాజశేఖర్ లకు తొలుత అందిజేశారు. సుమారు 150 మంది జర్నలిస్టులకు నిత్యావసరాల పంపిణీ చేశారు.
No comments:
Post a Comment