ఇంటింటికి నిత్యావసర వస్తువుల పంపిణీ
కూరగాయలు, కందిపప్పు, పంచదార పంపిణీ చేసిన 18 వ వార్డు బిజెపి నాయకురాలు డి. అరుణ కుమారి
ఎంవీపీ కాలనీ, పెన్ పవర్ : మహమ్మద్
కరోన వైరస్ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న లాక్ డౌన్ కారణంగా తినటానికి తిండి లేక పేదవాళ్లు చాలా ఇబ్బంది పడుతూ ఈ ప్రాంత ప్రజానీకం ఇళ్ల కే పరిమితం కావడంతో పేద ప్రజల జీవనోపాధి కష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో గత కొద్దిరోజులుగా బిజెపి నాయకురాలు డి అరుణ కుమారి నేతృత్వంలో ఎంవీ.పీ కాలనీలో పేదలకు అనేక సహాయ సహకరాలు చేస్తూ ముందు వరుసలో ఉన్నారు ఆమె అప్పు ఘర్ కోలని లో కూరగాయలు, కందిపప్పు, పంచదార పంపిణీ చేయటం జరిగింది. కాలనీ వాసులతో ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ లో ఎవరు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని ఒకవేళ వచ్చిన మాస్కులు మరియు సామాజిక దూరం తప్పనిసరి అని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, వాసుపల్లి శివ, జి అమరేశ్ పాల్గొనడం జరిగింది
No comments:
Post a Comment