పేదలకు సహాయం
అనకాపల్లి, పెన్ పవర్
పట్టణంలో పాత్రుడు కాలనీ శ్రీ సంపత్ వినాయక ఆలయ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పేదలకు, పోలీసులకు ఆహారాన్ని పంపిణీ చేశారు. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో పూట గడవని పరిస్థితి లో ఉన్న నిరుపేదలకు , విధుల్లో శ్రమిస్తున్న పోలీస్ సిబ్బందికి ఈ ఆహారాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీలా బాబు ' కొణతాల మహాలక్ష్మి నాయుడు, చుక్కా సత్యనారాయణ , దొడ్డి సత్యనారాయణ , దొండా కన్నయ్య దొర , కంఠం రెడ్డి రాజశేఖర్ , కొణతాల ఆదిలక్ష్మి, పెంటకోట సతీష్ కుమార్ , పి. వంశీకృష్ణ, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment