జిల్లా సరిహద్దులు పూర్తిగా మూసివేత – జిల్లా యంత్రాంగం నుండి పాస్ లు వున్నా వారికే అనుమతి
పర్యవేక్షణకు రెవిన్యూ, పోలీస్ అధికారులతో బృందాలు -జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్
విజయనగరం,
కరోనా పాజిటివ్ కేసులు లేని జిల్లాగా రానున్న రోజుల్లోనూ నిలిపేందుకు వీలుగా పొరుగు జిల్లాల నుండి రాకపోకలను పూర్తిగా నియంత్రించేందుకు నిర్ణయించామని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ చెప్పారు. దీనిలో భాగంగా జిల్లా సరిహద్దులను సీజ్ చేస్తున్నట్టు తెలిపారు. సరకు రవాణా వాహనాలు, జిల్లా కలెక్టర్, ఎస్.పి.ల నుండి అనుమతి పొందిన వాహనాలు మినహా ఇతర ఏ వాహనాలు ప్రవేశించేందుకు అనుమతించడం లేదని పేర్కొన్నారు. సరిహద్దుల్లో పోలీస్, రెవిన్యూ, వైద్య ఆరోగ్య శాఖల సిబ్బందితో సరిహద్దుల వద్ద సంయుక్త నిఘా బృందాలు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రజలు ప్రయాణించే ఎలాంటి వాహనాలకు జిల్లాలో ప్రవేశించేందుకు అనుమతి ఉండదని స్పష్టం చేసారు. డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టర్, రెవిన్యూ డివిజనల్ అధికారులు సరిహద్దుల ముసివేతను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. అదే విధంగా గ్రామాల్లో ప్రవేసించే వారిని నియంత్రించేందుకు స్థానిక కమిటీ లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గ్రామాల్లోకి ఇతర ప్రాంతాల నుండి ఎవరైనా వచ్చినట్లయితే జిల్లా కంట్రోల్ రూమ్ కు 08922-236947 ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు. ఎవరైనా అత్యవసరమైన పనుల పైన, వైద్య అవసరాల నిమిత్తం వెళ్ళాల్సి వస్తే జిల్లా కంట్రోల్ రూమ్ మెయిల్ ఐ.డి. aarogyavznm@gmail.com కు మెయిల్ చేసి ప్రయాణానికి అనుమతి పొందవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు అనుమతి పొందిన తర్వాతే తమ ప్రయాణాన్ని ప్రారంభించాల్సి ఉంటుందన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే భారీ జరిమానా
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని ప్రభుత్వం నిషేదించినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎవరైనా ఉమ్మి వేస్తె భారీ జరిమానా విధించడం జరుగుతుందన్నారు.
No comments:
Post a Comment