వాలంటీర్లు సచివాలయం ఉద్యోగులు పారిశుద్ధ్య కార్మికులకు శానిటైజర్స్ మాస్కులు అందజేసిన
ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు.
వి.మాడుగుల, పెన్ పవర్ :మజ్జి శ్రీనివాస మూర్తి
కరోనా వైరస్ నియంత్రణలో ప్రజల కోసం సచివాలయ ఉద్యోగులు గ్రామ వాలంటీర్లు పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని ప్రభుత్వం విప్ బూడి ముత్యాలనాయుడు అన్నారు. సోమవారం మాడుగుల ఎంపీడీవో కార్యాలయంలో మండల పరిషత్ సమకూర్చిన 2000 మాస్కులు 600 హ్యాండ్ శానిటైజర్స్ ను సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు పారిశుధ్య కార్మికులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా గ్రామాలలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంలో వాలంటీర్లు కార్మికులు సచివాలయ ఉద్యోగులు తీవ్రంగా కృషి చేశారని అన్నారు. ప్రజల కోసం శ్రమిస్తున్న వారికి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుందని. దేనికి వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు కట్టుబడి పనిచేయాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్మూలన తాగునీటి సమస్య లేకుండా చూడాలని కోరారు. లాక్ డౌన్ సందర్భంగా ప్రజలు సామాజిక దూరం పాటించాలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. గ్రామాల్లో వైరస్ నియంత్రణకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పోలినాయుడు మాట్లాడుతూ అహర్నిశలు ప్రజల కోసం శ్రమిస్తున్న సచివాలయ ఉద్యోగులు వాలెంటర్ల్లు పంచాయతీ కార్యదర్శులకు మాస్కులు శానిటైజర్స్ అందజేశారు. పారిశుద్ధ్య కార్మికులకు 20 కిలోల బియ్యం 700 రూపాయలు విలువచేసే నిత్యావసర సరుకులు ఇచ్చామన్నారు. మండల పరిషత్ మరియు పంచాయితీ నిధులతో మాస్కులు శానిటైజర్స్ కూర్చోమన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ఆర్.నీలయ్య వివో రామ సత్యనారాయణ పాల్గొన్నారు.
No comments:
Post a Comment