Followers

తెలంగాణ మద్యం ఆంధ్రలో పట్టివేత


 






తెలంగాణ మద్యం ఆంధ్రలో పట్టివేత


ముగ్గురు వ్యక్తులు అరెస్టు


ఎటపాక-పెన్ పవర్ : వెంకటేశ్వర్లు 

 

తెలంగాణ రాష్టానికి చెందిన మద్యాన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా తరలిస్తూ ఆంధ్రలో పట్టుబడ్డ ఘటన శుక్రవారం తెల్లవారుజామున కన్నాయిగూడెంగ్రామంలోచోటుచేసుకుంది,వివరాల్లోకి వెళ్తే...చింతూరు డిఎస్పీ. శ్రీ ఖాదర్ భాషా ఆదేశాల మేరకు మండల పరిధిలో ఉన్న అన్ని చెక్ పోస్టుల వద్ద వాహన తనిఖీలు చేపట్టారు ఈ క్రమంలో ఎటపాక మండలంలోని కన్నాయిగూడెం గ్రామ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో టీ ఎస్28 బి 9244 నెంబర్ గల కారులో 56 తెలంగాణా రాష్ట్ర మద్యం సీసాలు ఉన్నట్టు గుర్తించామని ఎటపాక సిఐ.గీతా రామకృష్ణ తెలిపారు,ఈ తనిఖీల్లో తెలంగాణా రాష్ట్రానికి చెందిన పెద్దిరాజు, సంతోష్, సాంబిరెడ్డిలను అరెస్టుచేసి ఆరా తీయగా చర్ల నుండి భద్రాచలం తరలిస్తున్నామని తెలిపారు,అట్టి వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై జ్వాలా సాగర్,చినబాబులు తెలిపారు.

 




 

 


 



 



No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...