Followers

విపత్కర పరిస్థితుల్లో ఎటపాక వైసిపి ఉదారత

 




విపత్కర పరిస్థితుల్లో ఎటపాక వైసిపి ఉదారత



- వైసిపి ఆధ్వర్యంలో ఉద్యోగులకు భోజనాలు

ఎటపాక, పెన్ పవర్ : వెంకటేశ్వర్లు 


లాక్ డౌన్ ప్రభావంతో ఎటపాక మండల కేంద్రంలోని చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ , రెవెన్యూ , మండల పరిషత్ , ఆరోగ్య శాఖ సిబ్బందికి ఎటపాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిన్నబోయిన.రవి , అంబికా.వాసు సహకారంతో ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎటపాక సీఐ గీతారామకృష్ణ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ సమాజంలో అన్ని దానాల్లో కల్లా అన్నదానం మహాదానమని పేర్కొన్నారు. దేశంలో కరోనా మహామ్మారి విజృంభిస్తున్న వేళ ప్రజలెవరూ కరోనా బారిన పడకుండా ఉండేందుకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్న నేపధ్యంలో కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకుగాను తీసుకోవాల్సిన జాగ్రత్తలను సీఐ గీతారామకృష్ణ ఉద్బోధించారు. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటిస్తూ విధిగా మాస్క్ ధరించాలని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మంత్రిప్రగడ.నరసింహరావు , రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి గోసు.ప్రశాంత్ (చింటూ) , జిల్లా కార్యదర్శి కొవ్వూరి.రాంబాబు , జిల్లా నాయకులు డేగల.రామకృష్ణ , కురినాల.వెంకటేశ్వర్లు (బుజ్జి), బాచినేని.రామకృష్ణ , మాదిరెడ్డి.కృష్ణమోహన్ , శీలం.కృష్ణ , గొల్లపల్లి.శివబాబు , మోసం.కన్నా , గజ్జల.రవి , సంతపూరి.వెంకటేశ్వర్లు , బయ్యని గణేష్ , కురినాల. నాగేంద్ర , కట్టా. ఓంకార్ , గజ్జల.నాగరత్నం , కురినాల.అనిల్ కుమార్ , విజయ్ , డేగల.చింటూ , బోడా.కుమార్ , వివిధ శాఖల అధికారులు , గ్రామసచివాలయ సిబ్బంది మరియు గ్రామవాలంటీర్లు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...