పేదలకు అండగా శ్రీరామ్
అనకాపల్లి , పెన్ పవర్
కరోనా వ్యాధి నియంత్రణలో ప్రజలందరూ భాగస్వామ్యం తీసుకుని భౌతిక దూరాన్ని పాటించాలని సీనియర్ వైకాపా నాయకులు కాండ్రేగుల శ్రీరామ్ పేర్కొన్నారు. లాక్డౌన్ తో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ఆసరాగా మంగళవారం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనకాపల్లి వైస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్ , వైస్సార్సీపీ యువ నాయకులు దాడి జయవీర్ సూచనల మేరకు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు . కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు రాష్ట్ర ప్రజల ఆరోగ్య రక్షణకై రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి విధించిన లాక్ డౌన్ ను విజయవంతం చేయాలన్నారు. పట్టణంలో నివసిస్తున్న అనేకమంది పేద ప్రజల ఆకలి దృష్ట్యా కొంత మందికైనా ఎంతో కొంత సహాయపడాలనే ఉద్దేశ్యంతో తాను ఈ కార్యక్రమం చేపటినట్లు తెలిపారు . తనకు సహకరించిన కాండ్రేగుల జోషి, దాడి ఈశ్వరరావు, కొణతాల భాస్కరరావు,పీలా రాంబాబు,కాండ్రేగుల సుబ్బు లు కు కృతజ్ఞతలు తెలిపారు. భీమునిగుమ్మం, రెల్లి వీధులలో నివసిస్తున్న సుమారు 400 మంది నిరుపేద కుటుంబాలకు కాయకూరలు పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో స్థానిక వైస్సార్సీపీ నాయకులు జాజుల రమేష్ ,కటారి దేముడు,కె.ఎమ్.నాయుడు, భీశెట్టి సందీప్, ఆడారి నాయుడు, పీలా ఉమా,ఆళ్ల శివగణేష్,సూరిశెట్టి గిరి,బుద్ధ గంగాధర్,పొలమరశెట్టి యుగంధర్,కావెల రవి, విల్లూరి సంతోష్,కర్రి భరత్,చంటి,మధు దాడి మిత్రబృందం పాల్గొన్నారు.
No comments:
Post a Comment