ఏపిటిఎఫ్ ఆద్వర్యంలో ఆహార పొట్లాలను సరఫరా
మాకవరపాలెం, పెన్ పవర్ ప్రతినిధి గోవింద్
కరోనా నివారణకు కృషి చేస్తున్న పోలీసు, ఆరోగ్యశాఖకు అభినందన మాకవరపాలెం కరోనా నివారణకు కృషి చేస్తున్న పోలీసుశాఖ, ఆరోగ్యశాఖకు అభినందనలు తెలియజేస్తూ మాకవరపాలం ఏపిటిఎఫ్ మండలశాఖ ఆహార పొట్లాలను సరఫరా చేశారు. ఈ సందర్భంగా మండలశాఖ సెక్రటరీ సిహెచ్.చక్రవర్తి మాట్లాడుతూ రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం ప్రజలను అప్రమత్తం చేయడంలో పోలీసుశాఖ, ఆరోగ్యశాఖ వారు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిఆర్ఎస్ఎన్.రాజు, ఎం.శేషగిరిరావు, కె.సత్యారావు, పి.ఆదినారాయణ, ఆర్ వి.దొర, పి.రంగరాజు, వరహాలబాబు, రమేష్, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment