వలస కార్మికులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ఎన్టీపీసి
పరవాడ పెన్ పవర్
సింహాద్రి ధర్మల్ పవర్(ఎన్టీపీసి) ప్లాంట్ వారు కరోనా వలన ప్రభుత్వం విధించిన స్వీయ నిర్బంధం(లాక్ డవున్) వలన రోజువారీ పనిచేసుకునే వలస కూలీలు పనులు లేక ఆదాయం రాక నిత్యావసర సరుకులు కొనలేని ఆర్ధిక ఇబ్బందులు పడుతుంటే చూసి వారికి నిత్యావసర సరుకుల ను పంపిణీ చేశారు.ఎన్టీపీసి మెయిన్ గెట్ ఎదురుగా ఉన్న రేకుల షెడ్లలో 54 కుటుంబాలు నివాస ముంటున్నారు ప్రస్తుత కరోనా కారణంగా వారికి పనులకు వెళ్లే అవకాశం లేక సంపాదన లేని కష్ట పరిస్థితుల్లో ఉన్నందున ఎన్టీపీసి వారు వారికి నిత్యావసర సరుకులు బియ్యము, నూనె,పప్పు,కారము,పంచదార లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జీఎం(ఓ&ఎమ్)హెచ్ సి వర్మ,మెయింటినెన్స్ జీఎం శివం శ్రీవాస్తవ,ఎజీఎం హెచ్ఆర్ ప్రేమ్ చంద్,యూనియన్ మరియు అసోసోషియేట్ సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment