మానవత్వం చాటిన ఎటపాక విలేకరి రంబాల కార్తీక్
ఎటపాక, పెన్ పవర్ ప్రతినిధి : వెంకటేశ్వర్లు
ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన ఎటపాక మండల పరిధిలోని విస్సాపురం గ్రామపంచాయతీ వలస ఆదివాసి గ్రామమైన గొల్లగుప్పలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని విస్సాపురం గ్రామపంచాయతీ గొల్లగుప్ప గ్రామానికి చెందిన మడివి.సుశీల(25)అనే బాలింత నెల రోజుల క్రితం మగ బిడ్డకు జన్మనిచ్చింది. రోజువారి లాగానే ఆదివారం సాయంత్రం తన ఇంటిని శుభ్రం చేస్తున్న క్రమంలో పాము సుశీల ఎడమ చేతి వేళ్ళ మీద కాటు వేసింది.పాము కాటు వేయగానే గుర్తించిన కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె ప్రాణాలు విడిచింది.తల్లి లేని పసిబిడ్డ కుటుంబానికి ఆర్థిక సహాయంగా ఎటపాక విలేకరి రంబాల కార్తీక్ 1500 రూపాయల నగదు అందజేశారు.ఈ సందర్భంగా బాధితురాలి కుటుంబ సభ్యులు రంబాల కార్తీక్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
No comments:
Post a Comment