విజయనగరం, పెన్ పవర్
కరోనా నిరోధానికి సామాజిక దూరాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. శుక్రవారం నాడు నగరంలోని 34 వ డివిజన్ పరిధిలో ఇందిరా నగర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలి త్రినాధ రావు కుటుంబ సభ్యులు తమ స్వంత నిధులతో ఏర్పాటుచేసిన కూరగాయల కిట్లను ఎమ్మెల్యే కోలగట్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ లాక్ డౌన్ నేపథ్యంలో రిక్షా, ఆటో కార్మికుల తో పాటు, దినసరి కూలీలు పేద ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా నిత్యావసరాల పంపిణీ చేసిందన్నారు. 1000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వం ప్రజలకు అందించిందని అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారి సూచనల మేరకు విజయనగరం నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుకు వచ్చి ప్రజలను అన్ని విధాలా ఆదుకున్నారు అన్నారు. నియోజకవర్గంలో ఎవరూ ఆకలితో ఉండకూడదని భావనతోనే వైయస్సార్ పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు ధైర్యాన్ని భరోసా కల్పిస్తున్నారు అని అన్నారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు బాలి యోగి మాట్లాడుతూ శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి గారి సూచన మేరకు ముప్పై నాలుగో డివిజన్ లో రెండు వేల కుటుంబాలకు కూరగాయలను పంపిణీ చేశామన్నారు. డివిజన్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ కరోనా వైరస్ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముప్పై నాలుగో డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి బాలి పైడి రాజు, బాలి నరేంద్ర అ తదితరులు ఉన్నారు...
No comments:
Post a Comment