Followers

విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బొగ్గు లారీ 


విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బొగ్గు లారీ 


 


పరవాడ, పెన్ పవర్ ప్రతినిధి : సీ హెచ్ అనిల్ కుమార్


పరవాడ మండలం:పరవాడ నుండి ఎలమంచిలి రహదారి గుండా అచ్యుతాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న కంపెనీలకు అధిక లోడుతో వెళుతున్న బొగ్గు లారీ ఎపి31టిబి9477 అతివేగంగా వెళ్తూ పరవాడ మండలం, రావాడ  పంచాయతీ పరిధి ధర్మారాయుడు పేట జంక్షన్ వద్ద  అదుపుతప్పి రోడ్డు ప్రక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీనితో విద్యుత్ తీగలు టిప్పర్ లారీ పై పడ్డాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుండి  డ్రైవర్ తప్పించుకొని బయటపడ్డాడు. ఈ ప్రమాదం చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. లాక్ డౌన్ కారణంగా రోడ్డుపై ఎవరు లేనందున ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీనితో పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు విద్యుత్ అంతరాయం కలిగింది

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...