హద్దులు లేని సేవలో ఆరిలోవ యువత
ఆరిలోవ. పెన్ పవర్ : భాస్కర్ కుమార్
మానవ విలువలు కనుమరుగు అవుతున్న ఈ రోజులలో కరోనా మహమ్మరి వచ్చి, ప్రతి ఒక్కరిలో మానవతా విలువలు చిగు రింపజేసాయి, ఆరిలోవ ప్రాంతానికి చెందిన రెడ్డి శ్రీ ధనుష్, కవిటి నాయుడు, రెడ్డి కృష్ణ., సుభాష్ బాబు, తదితరులు వారు సేకరించిన నిత్యవసర వస్తువులను, ఆరిలోవ పోలీస్ స్టేషన్ ఎస్సై గోపాల్ గారికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ ఐ గోపాల్ రావు మాట్లాడుతూ ఆరిలోవ స్టేషన్ పరిధిలో, వివిధ రాష్ట్రాల నుంచి వివిధ పనుల నిమిత్తం వచ్చి, లాక్ డౌన్ లో చికుకున్న వలస కూలీలను గుర్తించడం జరిగిందని, తమ ద్వారా నిజమైన లబ్ధిదారులకు కు నిత్యవసర వస్తువులను అందజేస్తున్నామని. నిత్యవసర వస్తువులు అందజేస్తున్న యువతను అభినందించిన ఆయన , దాతలు ముందుకు వచ్చి మరి కొంతమందిని ఆదుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment