Followers

వాలెంటీర్ల పై విమర్శలేలా 








--- ఉద్యోగ భద్రత కరువైనా

--- కరోనా సేవలు గణనీయమైనవి 

--- వారొక పార్టీ కాదు ఓ వ్యవస్థ 

--- ఇన్సూరెన్స్  ప్రకటిస్తే మేలంటున్న విశ్లేషకులు 

 

అనకాపల్లి , పెన్ పవర్ 

 

వాలంటీర్లుపై విమర్శలేలా. ఉద్యోగ భద్రత లేని వారి సేవలు గణనీయమైనవి. ప్రత్యేకించి కరోనా వ్యాధి  నియంత్రణలో అవిశ్రాంతంగా చేస్తున్న కృషి అభినందనీయమైనది అనేది క్షేత్రస్థాయిలో మాట. అయితే రాష్ట్రంలో రాజకీయం వాలెంటీర్ల చుట్టూనే తిరుగుతోందంటే ఆశ్చర్యం లేదు. ప్రభుత్వ పథకాల అమలు లొో  వాలంటీర్లె  కీలకం కావడంతో ఏ లోపం జరిగినా వాలెంటరీ వ్యవస్థనే ప్రత్యర్థులు టార్గెట్ చేస్తున్నారు.   దీంతో వారెంతగా సేవలందిస్తున్నా చేయలేదనే భావనను ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు.   నిజానికి  వాలెంటరీ అనేది ప్రస్తుతం ఓ వ్యవస్థగా రాష్ట్ర సేవల్లో నిలుస్తుంది. రాజకీయ పార్టీకి సంబంధించినది కాదు అనేది స్పష్టం. వాలెంటరీ నియామకాల్లో రాజకీయ సంబంధం  లేని విద్యావంతులు ఉన్నారన్నది స్పష్టం. భర్తీలో అక్కడక్కడ వైకాపా నాయకుల పెత్తనం కనిపించినా అన్ని పార్టీలకు చెందిన వారు వాలంటరీగా ఉన్నారన్నది తెలిసిందే.

      నిజానికి వాలంటీర్లు క్షేత్ర స్థాయిలో చేస్తున్న పని అంతా ఇంతా కాదు. ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులు ఎంపిక అనర్హులకు  గుర్తించడంలో నిత్యం  నిమగ్నం అవుతూనే ఉన్నారు. పింఛన్ల పంపిణీని ఇంటింటికి వెళ్లి చేపడుతూనే ఉన్నారు. అన్నింటికీ మించి కరోనా వంటి భయంకర  పరిస్థితుల్లో ఇంటింటికి సర్వేకి వెళ్లడమనేది వెలకట్టలేనిది. ఇదంతా భద్రత కానీ ఉద్యోగాలు చేస్తూ ఇలాంటి సేవలు అభినందనీయమినదిగా పలువురు పేర్కొంటున్నారు. ఆ   డాక్టర్లు ఉద్యోగులు పోలీసులు ప్రభుత్వ ప్రతినిధులు. ఉద్యోగ భద్రత కలిగిన విధులు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉద్యోగ భద్రత కానీ వలంటీర్లు సాహసాన్ని మించి చేయడం గొప్పదిగా చెబుతున్నారు.  ఈ క్రమంలో వలంటీర్లపై విమర్శలు ఎక్కుపెట్టడం సరికాదన్నది క్షేత్రస్థాయి మాట. చాలీచాలని జీతాలు ఆపై ప్రభుత్వం మారితే ఉంటారో లేదో అన్న మీమాంస. అయినా ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్న వాలంటీర్లలను ప్రభుత్వ వ్యవస్థగా చూడాలే తప్ప రాజకీయ పార్టీకి ప్రతినిధులుగా చూడకూడదనే వారు అధికమే. కేంద్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు  ఇన్స్యూరెన్స్  ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో వాలంటీర్లకు ముఖ్యమంత్రి ఇన్సూరెన్స్ ప్రకటిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


 

 




 



 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...