Followers

బెల్లం అమ్మకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే


 


 

 

బెల్లం అమ్మకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

 

అనకాపల్లి, పెన్ పవర్ ప్రతినిధి సాయి రామ్ 

 

పట్టణంలో ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ లో బుధవారం శాసనసభ్యులు గుడివాడ అమర్ నాధ్ చేతులమీదుగా బెల్లం అమ్మకాలు ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా  ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ తో  బెల్లం అమ్మకాలు నిలిచిపోయాయి. దీంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని  అమర్ నాధ్ బెల్లం అమ్మకాలు ను రెండు రోజులపాటు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఇటీవల ఆదేశించారు.  బెల్లం వర్తక లావాదేవీలు జరపడానికి కృషి చేసిన బెల్లం వర్తకులకు కలాసీలకు ,కొలగార్లకు ,అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం లో బెల్లం వర్తకులు కర్రి సన్యాసి నాయుడు, కొలపర్తి కన్నబాబు,సకలా గోవిందా,బొడ్డేడ శివ, బొడ్డేడ పెదరాము, ఆర్ డీ ఓ  సీతారామారావు,మార్కెట్ కమిటీ కార్యదర్శి రవి కుమార్, పట్టణ సర్కల్ ఇన్స్పెక్టర్ బాస్కర్ , వైకాపా నాయకులు పట్టణ అధ్యక్షులు మందపాటి జానకీ రామరాజు, యువజన అధ్యక్షులు జాజుల రమేష్, కోణతాల బాస్కర్, పీలా రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...