పరవాడ గ్రామంలో లాక్ డౌన్ నిబంధనలు బేఖాతరు
నిత్యవసరాల కోసం ఇష్టారాజ్యంగా రోడ్లపైకి వచ్చిన గ్రామస్తులు
పరవాడ, పెన్ పవర్
పరవాడ గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ నిబంధనలను పరవాడ గ్రామస్తులు భేఖాతరు చేస్తున్నారు.144 సెక్షన్ అమలులో ఉండగా మంగళవారం ఉదయం వారపు సంతలా వందల సంఖ్య జనాలతో కళ కళ లాడింది.నిత్య అవసరాల కోసం ఇష్టారాజ్యంగా పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. గాజువాకకు చెందిన చికెన్ వ్యాపారికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ వ్యక్తి పరవాడ మసీదులో వారం రోజుల పాటు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ మేరకు తనతో సన్నిహితంగా మెలిగిన కొంతమంది ముస్లిం సోదరులను అధికారులు హోమ్ క్వారంటైన్ చేసిన విషయం తెలిసిందే.అధికారులు,నాయకులు కూడా ఏదన్నా జరిగినప్పుడు హడావిడి చేస్తున్నారు తప్ప మిగిలిన సమయంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు అని గ్రామస్థులు వాపోతున్నారు.ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు రోడ్లపైకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. రోడ్లపైకి వచ్చిన ప్రజలు సామాజిక దూరం పాటించకపోవడం, కొంతమంది మాస్కు ధరించకపోవడం మరింత ఆందోళనకరమైన విషయం. పోలీస్ సిబ్బంది ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకు రావడంతో వారిని నియంత్రించ లేని పరిస్థితి ఏర్పడింది.ఇదే పద్ధతిలో ప్రజలు ప్రవర్తిస్తే పరవాడలో భయంకర పరిస్తులు వచ్చే రోజు ఎంతో దూరం లేదు అని గ్రామ ప్రజలు భయపడుతున్నారు.ఇప్పటికైనా పోలీసు శాఖ అధికారులు కఠినమైన నిర్ణయాలతో చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
No comments:
Post a Comment