Followers

పారిశుధ్యం, అవగాహన తోనే కరోనా నియంత్రణ సాధ్యం


పారిశుధ్యం, అవగాహన తోనే కరోనా నియంత్రణ సాధ్యం


               కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సమీక్ష


                          జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్ లాల్


విజయనగరం, పెన్ పవర్ 


 


:   జిల్లాలో కరోనా నియంత్రణకు  ఏడు  అంచెల  విధానాన్ని పాటిస్తూ   ప్రతి అంశం పై మైక్రో లెవెల్ లో  ప్రణాళికలు వేసుకుంటూ పర్యవేక్షించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్ లాల్ ఆదేశించారు.   శనివారం జిల్లా కమాండ్ కంట్రోల్  కేంద్రాన్ని తనిఖీ చేసి   సిబ్బంది పొందుపరుస్తున్న నివేదికలను పరిశీలించి తగు సూచనలు చేసారు.  అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ  సర్వైలెన్స్ , క్వరెంటైన్, ఆసుపత్రుల సన్నద్ధం,  సానిటేషన్, షెల్టర్ హోమ్స్,  నిత్యావసరాల సరఫరా, కాంటైన్మెంట్ అనే ఏడు అంశాల పై ప్రత్యెక దృష్టి పెట్టి పని చేస్తున్నామని తెలిపారు.   దేనికదే ముఖ్యమైనప్పటికీ ప్రస్తుత  పరిస్థితుల్లో పారిశుధ్యం, అవగాహనా కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత నివ్వాలని ఆదేశించారు.  


పారిశుధ్య కార్యక్రమాలు:


          పారిశుధ్యానికి సంబంధించి జిల్లాలోని ఐదు మున్సిపల్ ప్రాంతాల్లో నున్న 191 మురికి వాడల్లో 344 బృందాల ద్వారా ఇప్పటికే  సోడియం హైపో క్లోరైడ్ ను స్ప్రే చేయడమైనదని తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో, ప్రధాన రహదారుల్లో, మురికి వాడల్లో అన్ని వార్డుల్లో, కూడళ్ళలో, మార్కెట్లలో, రైతు  బజార్లలో ఇన్ఫెక్షన్ రాకుండా  క్లోరో క్విన్  ద్రావణాన్ని   అగ్నిమాపక యంత్రాల ద్వారా, టాంకర్ ల ద్వారా, ట్రాక్టర్ల ద్వారా చల్లడం జరిగిందని అన్నారు.  ఇందు కోసం 7136  లీటర్ల  సోడియం హైపో క్లోరైడ్, 1లక్ష 15 వేల 380 కేజీల  బ్లీచింగ్ ను, 75 వేల  కేజీల సున్నం ను , 131 లీటర్ల క్రిజోల్ ను వినియోగించడం జరిగిందన్నారు. అదే విధంగా రైతు బజార్ల వద్ద, మార్కెట్ ల వద్ద   భౌతిక  దూరాన్ని పాటించేలా ప్రత్యెక గదులను గీయడం జరిగిందని  అన్నారు.  మాస్కులు, గ్లౌస్  లు, గం బూట్స్, అప్రోన్స్ , శానిటైసర్లు,  తదితర వ్యక్తిగత రక్షణ పరికరాలను అందజేయడం జరిగిందన్నారు.


అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 5861 మంది పారిశుధ్య సిబ్బంది కి 20 వేల మాస్క్ లను, 300 లీటర్ల  శానిటైజర్ ను పంపిణీ చేసామని తెలిపారు. బ్లీచింగ్, ఫినాయిల్ నిత్యం గ్రామాల్లో స్ప్రే చేయడం జరుగుతుందని, మురికిని తొలగించడం, చెత్తను శుభ్రం చేయడం జరుగుతుందని, చేతులను కడుక్కోవడం పై విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేయడం జరుగుతుందని తెలిపారు.


ఐ.ఈ.సి కార్యక్రమాలు :


          పారిశుధ్య పనులు చేపడుతూనే కరోనా  పై అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున ఐ.ఈ.సి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు.  అన్ని వీధుల్లో 40 వాహనాల ద్వారా  మైక్ ల ద్వారా ప్రచారం, 2 లక్షల 76 వేల పాంఫ్లెట్ లను ముద్రించి పంచడం జరిగిందన్నారు. కరోనా నివారణకు తీసుకోవలసిన జాగ్రతల తో 5 మున్సిపాలిటీల్లో 256 హార్డింగ్ లను  ఏర్పాటు చేయడం జరిగిందని  తెలిపారు.  ప్రతి వార్డు లోను వార్డ్ వాలంటీర్ లతో అవగాహన కల్పించడం జరిగిందని, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే నేరమని, తరచుగా చేతులు శానిటైసేర్ లేదా సబ్బు తో కడుక్కోవాలని, మాస్క్ ను తప్ప కుండ వాడాలని, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు మో చేతిని అడ్డం పెట్టుకోవాలని, ముఖ్యంగా వృద్ధులను బయటకు పంప కుండ వారిని జాగ్రతగా చూసుకోవాలని తదితర అంశాల పై విస్తృతంగా ప్రచారం చేయడం జరిగిందన్నారు.


          ఈ సమావేశం లో  సహాయ కలెక్టర్ కేతన్ గార్గ్, జే.సి -2 కూర్మనాద్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి  డా. ఎస్.వి. రమణ కుమారి,  డి.సి.హెచ్.ఎస్. డా. నాగభూషణ్ రావు తదితరులు హాజరైనారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...