మరో వారం రోజుల లాక్ డౌన్ అత్యంత కీలకం
మంత్రి బొత్స సత్యనారాయణ..
విజయనగరం, పెన్ పవర్
మరో వారం రోజుల లాక్ డౌన్ అత్యంత కీలకం..ఇప్పటి వరకు కన్నా రెండింతలు అధికంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈనెల 5 వరకు 104 సాంపిల్స్ పంపించగా 64 నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది.. కేంద్ర ఆదేశాలు ప్రకారం విదేశీ, ఢిల్లీ, ఇతరప్రాంతాల నుంచి వారివి, వారి కాంటాక్ట్ సాంపిల్స్ తీసి పంపించాము. జిల్లాలోని కి ఇతర ప్రాంతాల నుంచి రాకుండా నాలుగు సరిహద్దుల్లో మూసి వేశాం క్వరంటైన్ లో ఉన్న వారిని సర్వీ లైన్స్ చేస్తున్నాం.. 345 మందికి జలుబు, దగ్గు ఉన్న వారిని గుర్తించి స్థానిక పిహెచ్ సీలకి తరలిస్తున్నాం క్వరంటైన్ కేంద్రాల్లో 4500 బెడ్ లు ఏర్పాటు చేసాం క్వరంటైన్ లో ఉన్న వారికి ఫుడ్, వసతి అందిస్తున్నారు.. జే ఎన్ టీయూ లో 113 మంది ఉన్నారు.. వారిని మరో వారం రోజుల్లో పూర్తి పరీక్షలు చేసి ఇళ్లకు పంపిస్తాం. రాష్ట్రంలో వ్యాధి లక్షణాలు వస్తాయేమోనని దశల వారీ చర్యలు చేపట్టాం..ఎలాంటి పరిస్తుతులు ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వ సలహాలు, సూచనలు ప్రజలు పాటించాలని విజ్ఞప్తి కేంద్రం లాక్ డౌన్ ప్రకటించారు దాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. సోషల్ డిస్టెన్స్ లో ప్రజలు ఉండాలి. రైతు బజార్లు విస్తరించాం. కార్పొరేషన్ లలో మొబైల్ మర్కెట్స్ పెట్టాం..ఆర్టీసీ బస్సుల్లో కూడా మొబైల్ మార్కెట్స్ పెట్టాలని యోచిస్తున్నాం. జిల్లాలో ఇంకా 30 వేల మందికి వెయ్యి రూపాయల కరోనా విపత్తు సాయం అందించాల్సి ఉంది. ప్రభుత్వం ఇస్తున్న సాయం అందరికీ అందుతుంది. ఇందులో రాజకీయాలకి తావులేదు. నిత్యా వసర ధరలపై నియంత్రణ ఉంది. ఎక్కువ ధరలకు విక్రయించే వారిపై చర్యలు ఉంటాయి. ఏడు అంశాల పై ఒక్కో నోడల్ అధికారిని నియమించాం..ఇతర జిల్లాలు, ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకొని ఇక్కడే ఉండి పోయిన విద్యార్థులు, తీర్ధ యాత్రికులు, వలస కార్మికులు, భిక్ష గాళ్ళు, అనాధుల కి 34 కేంద్రాల్లో 3500 మందికి భోజనం, వసతి కల్పిస్తున్నాం. ఈ కేంద్రాల్లో 18 వరకు ప్రయివేటు కేంద్రాలు కూడా ఉన్నాయి. ప్రతి కుటుంబం ఆరోగ్యం కాపాడడమే ప్రభుత్వ లక్ష్యం.. జిల్లా, నియోజక వర్గాలలో టాక్స్ ఫోర్స్ లు ఏర్పాటు చేసాం..వాటి నివేదిక లపై నిరంతరం పర్య వేక్షిస్తున్నాం. ఎవరూ ఆందోళన కి గురి కావొద్దు.. కరోనాకి ఒకటే మందు సోషల్ డిస్టెన్స్ పాటించడమే. రేషన్ కార్డు ఉండి డేటా లేకపోయిన వారికి కూడా వెయ్యి రూపాయలు అందిస్తారు..ఇది ప్రభుత్వ ఆదేశాలు తప్పక అమలు చేయాల్సిందే. సర్వే లైన్స్ కి వెళ్లే ప్రతి వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకి మాస్క్ లు, శాని టైజర్ తప్ప ని సరిగా ఇవ్వాల్సిందే..
పీపీఈ కిట్లు సరిపడా ఉన్నాయి.
ఎన్నికల కమిషన్ ఏ ఆదేశాలు ఇచ్చారో నాకు తెలియదు కానీ, ఎమ్మెల్యే గా గెలిచిన వారికి, పార్టీ నాయకుడు, కార్యకర్త కు ప్రజలకు సాయం అందించడం, సహకరించడం తప్పా.. దానిపై విమర్శలు చేసేవారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఈ నెల 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తి వేయా లని ఒక మంత్రిగా కాకుండా సామాన్యుడిగా కోరుకుంటున్నాను.
No comments:
Post a Comment