Followers

విధి నిర్వహణలో అలసత్వం   వహిస్తే  కఠిన చర్యలు తప్పవు. ఐటీడీఏ పీవో  బాలాజీ.


విధి నిర్వహణలో అలసత్వం   వహిస్తే  కఠిన చర్యలు తప్పవు. ఐటీడీఏ పీవో  బాలాజీ.

స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం/పాడేరు (పెన్ పవర్)



విధి నిర్వహణలో  నిర్లక్ష్యం వహిస్తే  సహించేది లేదని  పాడేరు  సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ  ప్రాజెక్ట్ డైరెక్టర్  డీకే బాలాజీ  హెచ్చరించారు. మంగళవారం  స్థానిక  గిరిజన సహకార సంస్థ  గోదాంను  ఆయన తనిఖీ చేశారు. డిపోలకు  తరలించే  నిత్యావసర సరుకుల  తూకాల్లో  అవకతవకలు  జరిగితే  కఠిన చర్యలు  తీసుకుంటామని  అన్నారు. గిరిజనులకు  పంపిణీ చేసే  నిత్యావసర సరుకులు  సక్రమంగా అందాలని   ఆయన  సూచించారు. గోదాంలో  సరుకులు తరుగు  ఉన్నట్లు రుజువు అయితే   తగిన చర్యలు తప్పవని  అన్నారు. మంగళవారం  ఉదయం జరిగిన  వీడియో  కాన్ఫరెన్స్ కు  హాజరు కాలేదని  స్థానిక జిసిసి గోదాం  ఇంచార్జి పై  ఆయన  ఆగ్రహం  వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో  ఎవరు నిర్లక్ష్యం వహించిన  చర్యలు తీసుకుంటామన్నారు.



   ఉదయం ఆరు గంటలకి  ఉచిత బియ్యం పంపిణి.



ఏప్రిల్ 29  ఉదయం  ఆరు గంటల నుంచి   ఉచిత బియ్యం పంపిణీ  చేపట్టాలని  పాడేరు  ఐటీడీఏ  పివో  డికే బాలాజీ   అన్నారు. మంగళవారం   మండల స్థాయి  అధికారులతో  వీడియో   కాన్ఫరెన్స్  నిర్వహించారు. ఏజెన్సీలోని  పదకొండు మండలాల పరిధిలో  జి సి సి డిఆర్  డిపోల ద్వారా   మూడో విడత  ఉచిత బియ్యం పంపిణీ  జరుగుతుందన్నారు. ఆరుగంటల  నుంచి  ఉచిత బియ్యం పంపిణీ  ప్రారంభించాలని   కోరారు. ప్రతి కార్డు దారునికి  శానిటైజర్స్  ఇచ్చిన తర్వాత  బయోమెట్రిక్ వేయించాలని తెలిపారు. నిత్యావసర వస్తువులు  సక్రమంగా  అందించాల్సిన బాధ్యత మండల స్థాయి  అధికారులు  వహించాలని  కోరారు. వీడియో కాన్ఫరెన్స్ లో 11 మండలాల  తహసిల్దార్లు  ఎంపీడీవోలు జి సి సి  మేనేజర్లు గోదాం ఇంచార్జ్ లు  పాల్గొన్నారు.


 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...