రావులపాలెం, పెన్ పవర్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ పాటిస్తున్న కారణంగా ఉపాధి కోల్పోయిన ఫోటో గ్రాఫర్లకు సి.ఐ వి.కృషి చేతులు మీదుగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. బుధవారం యూనియన్ కార్యాలయ భవనం వద్ద జరిగిన కార్యక్రమంలో ది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వీటిని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు మండలాల ఫోటోగ్రాఫర్స్ కి అందజేశారు. 25 కె.జీల బియ్యం ,1 కెజీ పంచదార, కెజి గోధుమ నూక, 1 కెజి ఇడ్లీ రవ్వ, 100 గ్రా. టీ పొడిని అందజేసినట్లు యూనియన్ అధ్యక్షుడు గుబ్బల వెంకటరమణ, కార్యదర్శి మనోజ్ లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రెజరర్ పవన్, నల్లమిల్లి రామారెడ్డి, సిరి రాము, మురళీ(ఎర్రబుజ్జి), సతీష్, మానే రాజు, పి.కె నాగేశ్వరరావు, మాణిక్యం, రాజా, సత్యనారాయణ, ఏడుకొండలు,దొర బాబు, షైనీ రవి, బ్రహ్మం, పవన్ (రాజా), తేజ, అయ్యప్ప, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment